40-31తో పుణెరి పల్టన్‌పై గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12
న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ లీగ్ దశలో 9వ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. శనివారం న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌పై 40-31తో 9 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. 26-11తో తెలుగు టైటాన్స్ తొలి 20 నిమిషాల ఆటలో ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.
కెప్టెన్ విజరు మాలిక్ 10 పాయింట్లు, ఆల్‌రౌండర్ భరత్ 11 పాయింట్లు, డిఫెండర్ శుభమ్ షిండె 5 పాయింట్లతో తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పుణెరి పల్టన్ రెయిడర్ సచిన్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. పీకెఎల్‌లో నేడు జరిగే లీగ్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది.