హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన యూనిక్ లవ్ స్టొరీ ‘తెలుసు కదా’ ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 17న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సెన్సార్ టాక్ ప్రకారం చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్స్ట్ రావండతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా రన్‌టైమ్ 2 గంటల 16 నిమిషాలు. ఎలాంటి లాగింగ్ లేకుండా రేసీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా పాత్రలు యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఈ ప్రేమకథ సాగనుంది. కథలో ఊహించని మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి. వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఇప్పటికే తమన్ కంపోజ్ చేసిన రెండు పాటలు వైరల్ అవడంతో మ్యూజిక్ సినిమా మీద మరింత బజ్ క్రియేట్ చేసింది. ఈ దీపావళికి రొమాన్స్, ఫన్, ఫీల్, సోషల్ మెసేజ్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘తెలుసు కదా’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -



