Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల టెంకాయలు, లడ్డులు వేలం

నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల టెంకాయలు, లడ్డులు వేలం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 28 నుండి వచ్చే నెల 05 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టెంకాయలు, లడ్డు–పులిహోర, కొబ్బరి చిప్పల విక్రయ హక్కుల కోసం వేలం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, ఈఓ నరసింహులు తెలిపారు.

టెంకాయల విక్రయ హక్కులకు రూ.20,000, లడ్డు–పులిహోరకు రూ.10,000, కొబ్బరి చిప్పల విక్రయానికి రూ.10,000 డిపాజిట్ చెల్లించి ఆసక్తి గల వ్యక్తులు వేలంలో పాల్గొనవచ్చని వారు పేర్కొన్నారు.

ఈ వేలం కార్యక్రమం 13-02-2026 (శుక్రవారం) ఉదయం 11:00 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించబడుతుందని వెల్లడించారు. ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -