- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
నేడు దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుందని నూతన చైర్మన్ లింబాద్రి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఆలయ వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ భక్తులు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -