- Advertisement -
మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ
నవతెలంగాణ – పరకాల
ప్రస్తుతం నిర్వహిస్తున్న పశువుల సంత తాత్కాలికంగా దామెర చెరువు స్థలంలోకి మార్చినట్లు మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ పత్రిక సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుత పశువుల సంత ప్రాంగణంలో మహా రుద్ర యాగం జరుగుతున్నందున ఈనెల 26వ తేదీ ఆగస్టు 2 తేదీ ఆదివారం రోజులలో జరగాల్సిన సంత తాత్కాలికంగా మార్చినట్లు తెలిపారు. మహా రుద్ర యాగం అనంతరం నవంబర్ 8వ తేదీ ఆదివారం తిరిగి ఏదాస్థానం ప్రస్తుత పశువుల సంత స్థలంలోనే అంగడి నిర్వహించడం జరుగుతుందన్నారు.
- Advertisement -