Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపది రోజులు…82 గంటల 47 నిమిషాలు

పది రోజులు…82 గంటల 47 నిమిషాలు

- Advertisement -

11 బిల్లులు ప్రతిపాదించగా పదింటికి ఆమోదం
సెలెక్ట్‌ కమిటీకి ఒక బిల్లు
నిరవధికంగా ఉభయసభలు వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు పది రోజులు జరిగాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సభ నడిచిందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వెల్లడించారు. మొత్తం 11 బిల్లులు ప్రతిపాదించగా, వాటిలో పదింటికి ఆమోదం లభించింది. ఒక బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు. సభలో మూడు తీర్మానాలు చేశారు. పార్టీల వారీగా సభ్యుల సంఖ్యా బలాన్ని స్పీకర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌కు 66 మంది, బీఆర్‌ఎస్‌కు 37, బీజేపీకి 8, ఎంఐఎంకు ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. సభ్యుల నుంచి 590 ప్రశ్నలు రాగా, 505 స్టార్‌ క్వశ్చన్లను అడ్మిట్‌ చేశారు. 53 అన్‌స్టార్‌ క్వశ్చన్లను స్వీకరించారు.

శాసనసమండలి 6 రోజుల్లో 30 గంటల 8 నిమిషాలు పనిచేసిందనీ, 22 స్టార్‌ గుర్తువున్న ప్రశ్నలు చర్చకు వచ్చాయని మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మండలిలో పార్టీల వారీగా సభ్యుల సంఖ్యను ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు 20 మంది, కాంగ్రెస్‌ 6, బీజేపీ 3, ఎంఐఎం ఇద్దరు, సీపీఐ ఒకరు, ఇండిపెండెంట్‌ ఒకరు, నామినేటెడ్‌ సభ్యులు నలుగురు ఉన్నారని తెలిపారు. శాసనసభలో సభానాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డి 4గంటల 26 నిముషాలు మాట్లాడారు. బీజేపీ పక్షనేత 3 గంటల 28 నిముషాలు, సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు 4 గంటల 22నిముషాలు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్‌ సభకు హాజరుకాని విషయం తెలిసిందే. అయితే శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు 16 గంటల 12 నిముషాలు మాట్లాడారని స్పీకర్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -