Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొదటిరోజు పది పరీక్షలు ప్రశాంతం: ఎంఈఓ

మొదటిరోజు పది పరీక్షలు ప్రశాంతం: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 639 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. దీని కోసం మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 189 మంది, సెయింట్ థెరిస్సా పాఠశాలలో 230 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 220 మంది విద్యార్థులకు సంబంధించి ఆయా కేంద్రాలు కేటాయించారు. మొదటి రోజు పరీక్షలకు 638 మంది విద్యార్థులు హాజరయ్యారని మండల విద్యా అధికారి (ఎంఈఓ) యన్.విజయ్ కుమార్ తెలిపారు. మూడు కేంద్రాలకు 32 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా, మొదటి రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఎంఈఓ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -