Thursday, May 8, 2025
Homeజాతీయంపాక్‌ కాల్పులు..పది మంది భారత పౌరులు మృతి

పాక్‌ కాల్పులు..పది మంది భారత పౌరులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావ‌రాలే ల‌క్ష్యంగా భార‌త సైన్యం మంగ‌ళ‌వారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడుల‌కు పాల్పడిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నియంత్రణ రేఖ వ‌ద్ద పాకిస్థాన్‌ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో పది మంది భార‌త పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమాయ‌క ప్రజ‌ల‌ను పాక్ బ‌లిగొంద‌ని భార‌త సైన్యం తెలిపింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. దీనికి బ‌దులు తీర్చుకుంటామ‌ని పేర్కొంది.
ఇక భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా మొత్తం 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. భార‌త ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బ‌ల‌గాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించి, మిస్సైళ్లతో ఉగ్రవాద స్థావ‌రాల‌పై విరుచుకుప‌డ్డాయి. పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక స‌దుపాయాల‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి. మొత్తం తొమ్మిది స్థావ‌రాల‌పై ఇండియ‌న్ ఆర్మీ దాడులు చేప‌ట్టింది. ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తావులేకుండా.. పాక్ సైనిక స‌దుపాయాల‌పై ఎక్కడా దాడులు చేప‌ట్టలేద‌ని భార‌త ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడుల‌కు సంబంధించి అర్ధరాత్రి భార‌త సైన్యం ఎక్స్‌లో పోస్టు చేసింది. మరోవైపు భారత్‌ జరిపిన ఈ దాడుల్లో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -