Sunday, April 5, 2026
E-PAPER
Homeక్రైమ్కౌలు రైతు ఆత్మహత్య

కౌలు రైతు ఆత్మహత్య

- Advertisement -

– పంట నష్టం, ఆర్థిక ఇబ్బందులు కారణం
– గజ్వేల్‌ మండలం జాలిగామలో ఘటన
నవతెలంగాణ-గజ్వేల్‌ రూరల్‌

పంట నష్టం.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం జాలిగామ గ్రామంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మణ్‌(29) భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. తన ఎకరం పొలంతోపాటు 9 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. నాలుగెకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న, 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. అయితే, ఆశించిన మేర పంట దిగుబడి రాలేదు.. పెట్టుబడి కూడా చేతికందక అప్పులు పెరిగిపోయాయి. సుమారు రూ.8 లక్షల అప్పులయ్యాయి. మానసికంగా కుంగిపోయిన లక్ష్మణ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న గజ్వేల్‌ పోలీసులు జాలిగామ గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -