Friday, December 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటెండర్ల నిబంధనలు పాటించాల్సిందే

టెండర్ల నిబంధనలు పాటించాల్సిందే

- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ, చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ఆశిష్‌ మెహ్రోత్రా

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాంట్రాక్టు విధానంలో టెండర్ల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ అన్నారు. నిర్ణయాలను మూల్యాంకనం చేయడంలో అధికారులదే కీలకపాత్రని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. గురువారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో ‘టెండర్లు, కాంట్రాక్టులతో విజిలెన్స్‌ దృక్పథం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ కాంట్రాక్టులు, టెండర్లపై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేసే అవకాశం లేదన్నారు. అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్య ప్రకాష్‌ మాట్లాడుతూ టెండర్లు దాఖలు చేయబడిన ఉద్దేశాన్ని సకాలంలో నెరవేర్చడానికి చురుగ్గా వ్యవహరించాలని చెప్పారు. అన్ని రకాల టెండర్లను త్వరగా ఖరారు చేయాలని తెలిపారు. కాంట్రాక్టులను పొడిగించే సమయంలో వాటిని క్షుణ్ణంగా సమీక్షించాలని అధికారులకు సూచించారు.

రైల్వే పనులు చేపట్టే క్రమంలో కాంట్రాక్టులకు సంబంధించి టెండర్‌ నిబంధనలను పాటించాల్సిందేనని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ మెహ్రోత్రా అన్నారు. విజిలెన్స్‌ అనేది వాటాదారుల సమిష్టి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. రోజువారీ పనిలో శాఖాపరమైన నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని సూచించారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(సమన్వయం), జనరల్‌ మేనేజర్‌ కార్యదర్శి మల్లాది శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, భారత కాంట్రాక్టు చట్టం, వస్తువుల అమ్మకం చట్టం, జీఎఫ్‌ఆర్‌, ఇండియన్‌ రైల్వే విజిలెన్స్‌, మాన్యువల్‌, సీవీసీ మాన్యువల్‌, రైల్వే బోర్డు సర్క్యులర్లు, సూచనలతో అందుబాటులో ఉన్న అంశంపై నిబంధనలు చర్చించబడ్డాయని అన్నారు. ప్రతిపాదనల సూత్రీకరణ, కాంట్రాక్టు నిర్వహణ, అసాధారణంగా తక్కువ రేటింగ్‌ ఉన్న బిడ్‌లను పరిశీలించాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -