Tuesday, September 16, 2025
E-PAPER
Homeఆటలుటెన్నిస్‌ ఛాంప్‌ మధుసుదన్‌

టెన్నిస్‌ ఛాంప్‌ మధుసుదన్‌

- Advertisement -

ముగిసిన హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

హైదరాబాద్‌ : 22వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేతగా మధుసుదన్‌ లింగా నిలిచారు. హైదరాబాద్‌లోని విజరు టెన్నిస్‌ అకాడమీలో సోమవారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ (50+) ఫైనల్లో సాంబ శివారెడ్డిపై 6-4, 6-4తో మధుసుదన్‌ లింగా గెలుపొందారు. వరుస సెట్లలో శివారెడ్డిపై పైచేయి సాధించిన మధుసుదన్‌ టైటిల్‌ సాధించాడు. మధు (30+), భరణి (35+), రాజ (40+), బోస్‌ కిరణ్‌ (45+), కెవిన్‌ మూర్తి (55+), రమేశ్‌ (60+), సురేశ్‌ (70+), రామ్‌ మోహన్‌ (75+) మెన్స్‌ సింగిల్‌ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డబుల్స్‌ విభాగంలో సౌరభ్‌, వాహీద్‌ (30+), రాజ, విజరు కిరణ్‌ (35+), లగ్గాని శ్రీనివాస్‌, రాజ (40+), మధు, మనీశ్‌ (45+), జాకీర్‌, విక్రమ్‌ (50+), చంద్రశేఖర్‌ రెడ్డి, రియాజ్‌ (55+), ఆనంద్‌ స్వరూప్‌, మెహర్‌ ప్రకాశ్‌ (60+), గజపతి, ధనంజయులు (70+), సాయిరామ్‌బాబు, అశోక్‌ రెడ్డి (75+)జోడీలు టైటల్స్‌ సాధించారు. మల్టీజోన్‌ ఐజీ ఎస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఐజీ (స్పోర్ట్స్‌) రమేశ్‌ రెడ్డి, రిటైర్డ్‌ ఐజీ ఎస్‌ కాంతారావులతో కలిసి హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఓటీఏ) అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి విజేతలకు బహుమతులు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -