– ఖమ్మంలో బీజేపీ కార్యకర్తలు.. యువకుల మధ్య ఘర్షణ
– ఇరుగ్రూపుల నుంచి పదిమందిపై కేసు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
బీజేపీ సోమవారం నిర్వహించిన తిరంగా ర్యాలీ ఖమ్మంలో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఇల్లందు క్రాస్‌రోడ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు, యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. ర్యాలీ 100 మీటర్ల దూరం ఉండగానే పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన ఇద్దరు యువకులు తమ పరిస్థితిని కానిస్టేబుల్‌కు వివరించినా వినలేదు. ఈ లోగా ర్యాలీ అక్కడికి రావడం… తలపై టోపీ ధరించి ఉన్న యువకులను చూసి మతం పేరుతో బీజేపీ కార్యకర్తలు కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. బీజేపీ కార్యకర్త ఒకరు యువకుని తలపై ఉన్న టోపీ తీసి కాలు కింద వేసి తొక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ యువకులను స్టేషన్‌లోకి తీసుకువెళ్లారు. ఇంతలో సమాచారం అందుకున్న ఆ యువకుల అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గీయులను నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి వారిని చెల్లాచెదురు చేసి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. చివరకు ఇరువర్గాల నుంచి ఐదుగురు చొప్పున కేసులు నమోదు చేశారు.
బీజేపీ తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES