Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'మున్సిపల్‌' కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

‘మున్సిపల్‌’ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ-విలేకరులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్‌లోని రెండోవార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉండగా, బీఆర్‌ఎస్‌ బలపర్చిన గోలి మమతా మెజార్టీ ఓట్లతో గెలుపొందారు. గెలిచిన ఆనందంలో అభ్యర్థి తన అనుచరులతో కలిసి బైక్‌లపై వెళ్తుండగా.. ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ షహానాజ్‌ సమీర్‌ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారి మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త సంతోష్‌పై, అతని అనుచరులపై దాడి చేయడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్‌రెడ్డి కలిసి బాధితునితో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నల్లగొండ కార్పొరేషన్‌లోని 29వ డివిజన్‌లో రీకౌంటింగ్‌ కారణంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

29వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి ఆరు ఓట్ల తేడాతో గెలవడంతో కాంగ్రెస్‌ పార్టీ రీకౌంటింగ్‌ చేయాలని సూచించింది. ఆర్వో రీ కౌంటింగ్‌కి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోటాపోటీ తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. ఇదే క్రమంలో 14వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు రీ కౌంటింగ్‌ పెట్టాలని నిరసన తెలిపారు. దాంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి కౌంటింగ్‌ వద్దకు చేరుకోగా పోలీసులు ముందస్తుగా అతని కారును అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరగడంతో పోలీసులు లాఠీÄచార్జి చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 16వ వార్డు రీకౌంట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు లోపలికి రానీయకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -