- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. ఘటనాస్థలి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
- Advertisement -



