పరీక్ష ఆలస్యంపై భగ్గుమన్న విద్యార్థుల తల్లిదండ్రులు
గంటలు గడిచినా ప్రారంభం కాకపోవడంతో పాఠశాల ముందు బైటాయించి ఆందోళన
నవతెలంగాణ- ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గురుకుల పాఠశాలలో ఆదివారం జరగాల్సిన గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సిన పరీక్ష, గంటలు గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. దూర ప్రాంతాల నుంచి తమ పిల్లలను పరీక్షకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు, అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పాఠశాల గేటు ముందు బైటాయించారు. ఎండలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నిర్వహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరీక్షా పత్రాల పంపిణీలో జాప్యమా లేక సాంకేతిక కారణాలా అన్నది తెలియాల్సి ఉందని తెలిపారు.
ర్యాలంపాడు గురుకుల పరీక్షా కేంద్రంలో ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



