నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా సహజ వనరులపై కన్నెసిన అమెరికా..ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురో తోపాటు ఆయన భార్యను దౌర్జన్యంగా నిర్భంధించి న్యూయార్క్ తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. వామపక్షలతో పాటు ప్రజాస్వామ్యవాదులు ట్రంప్ చర్యలను ముక్తకంఠంతో ఖండించారు.
తాజాగా ట్రంప్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసనలు జరిగాయి. చైన్నెలోని యూఎస్ కాన్సులేట్ ఎదుట CPI ఆందోళన నిర్వహించింది. అమెరికా ప్రెసిడెంట్ వ్యతిరేకంగా ఆ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. వెంటనే మదురోను విడుదల చేయాలని, ట్రంప్ చర్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉన్నాయని మండిపడ్డారు. ద్వేష భావంతో సార్వభౌమదేశమైనా వెనిజులాపై అమెరికా చేసిందని, ఏ అధికారంతో ఆ దేశ ప్రెసిడెంట్‌ను నిర్భందించారని ప్రశ్నించారు. సీపీఐ శ్రేణుల నిరసనలతో బలగాలు అప్రమత్తమైయ్యాయి. యూఎస్ కాన్సులేట్ ఎదురుగా భారీ సంఖ్యలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా చేరుకున్న సీపీఐ శ్రేణులు కాన్సులేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ముందుకు దూసుకొచ్చారు. బలగాలు ఆందోళన కారులను అదుపు చేశాయి.



