Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంగల్ఫ్‌లో టెన్షన్‌..టెన్షన్‌

గల్ఫ్‌లో టెన్షన్‌..టెన్షన్‌

- Advertisement -

వార్‌ ఉద్రిక్తతలతో స్వదేశానికి 52 వేల మంది
ముంబయి : అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడుల తో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలపై దాడుల పేరిట యూఏఈ, సౌదీ అరేబి యా, కువైట్‌, బహ్రెయిన్‌ దేశాలపై నా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న, యుద్ధ పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో గల్ఫ్‌ దేశాల నుంచి 52 వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ”గల్ఫ్‌ రీయన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించడంతో మార్చి 1 నుంచి 7 మధ్యలో 52 వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో సుమారు 32 వేల మంది భారత విమానాల్లో ప్రయాణించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విమాన కార్యకలాపాలు ఇంకా అందుబాటులోకి రాని దేశాల్లో ఉన్న భారత పౌరులు.. స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి” అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, సాయం అవసరమైన వారందరికీ అండగా నిలిచేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నట్టు స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉన్న భారత పౌరులు.. స్థానిక అధికారుల మార్గదర్శకాలను, అక్కడి భారత దౌత్య కార్యాలయాలు జారీచేసే సలహాలను పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది. ఇప్పటికే అవసరమైన అడ్వైజరీలను స్థానిక భారత ఎంబసీ, కాన్సులేట్‌ జారీచేశాయని తెలిపింది. అత్యవసర సమయాల్లో హెల్ప్‌ లైన్‌ నంబర్లను సంప్రదించాలని తెలిపింది. అదే విధంగా విదేశాంగ శాఖ కార్యాలయంలో ఓ ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.

సంప్రదించాల్సిన నంబర్లు
1800118797 (టోల్‌ ఫ్రీ)
0091 11 2301 2113
0091 11 2301 4104
0091 11 2301 7905

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -