– ఫీజు చెల్లింపునకు తుదిగడువు 16
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదేనెల 13 వరకు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని కోరారు. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల 16 వరకు ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.50తో పరీక్ష నిర్వహించే రెండు రోజుల ముందు వరకు చెల్లించే అవకాశముందని తెలిపారు. మూడు కంటే తక్కువ సబ్జెక్టులుంటే రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులుంటే రూ.125 ఫీజు చెల్లించాలని కోరారు.
జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
- Advertisement -
RELATED ARTICLES