నవతెలంగాణ – దామరచర్ల: టెన్త్ పరీక్షా ఫలితాలలో మండలంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ సిస్టర్ లిమా మేరీ తెలిపారు. 550 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచిన ఎన్. శివానితో పాటు ఆమె తల్లిదండ్రులను బుధవారం శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మోమెంటును అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..పాఠశాలలోని 36 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ..36 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నూరు శాతం రిజల్ట్ సాధించారు. ఏడుగురు విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు బి. సత్యనారాయణ, కె.శ్రీను, ఆర్.హనుమాన్, పి.జాన్ పీటర్, సిస్టర్స్ రాణి,యాని తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ దామరచర్ల మండల టాపర్ ఎన్.శివాని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES