-776 మందికి 776 మంది హాజరు
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మండలపరిధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం776 మంది విద్యార్థులు నమోదు కాగా,776 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరైనట్లు వెల్లడించారు. మండల పరిధిలోని జడ్‌పి హెచ్‌ఎస్ బాయ్స్ రాయికల్‌లో 251 మంది, జడ్‌పి హెచ్‌ఎస్ గర్ల్స్ రాయికల్‌లో 250 మంది, జడ్‌పి హెచ్‌ఎస్ భూపతిపూర్‌లో 118 మంది, జడ్‌పి హెచ్‌ఎస్ అల్లీపూర్‌లో 157 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 04 చీఫ్ సూపరింటెండెంట్లు,04 డిపార్ట్‌మెంటల్ అధికారులు,43 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించినట్లు తెలిపారు.
పూర్తి హాజరుతో ప్రశాంతంగా పది మొదటి రోజు పరీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



