కులగనన రెమ్యూనిరేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలి
టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్
పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ రెమ్యూనరేషన్, పులగనన రెమినరేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల బుధవారం పదవ తరగతి స్పాట్ సెంటర్ ల నందు నిరసన తెలుపుతామని పారుపల్లి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని రావినూతలలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ ఇంటి వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవ తరగతి 2025 స్పాట్ రెమ్యూనరేషన్, 2024 సంవత్సరంలో నిర్వహించిన కుల గణన రెమ్యూనరేషన్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.
మంగళవారం సాయంత్రం కల్లా బిల్లులు విడుదల చేయకపోతే బుధవారం జరిగే పదవ తరగతి పరీక్ష సెంటర్ల నందు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని హెచ్చరించారు. పదవ తరగతి స్పాట్ కేంద్రాల్లో టీటీజెఏసి, యూ ఎస్ పి సి, జాక్తో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 2024లో సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నేటి వరకు పారితోషికం ఇవ్వకపోవడం పై పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమస్యలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సుల్తానియా కు రాష్ట్ర నాయకులు వినత పత్రం అందజేశారని తెలిపారు. దీంతో ఆయన స్పందిస్తూ మా దృష్టిలో ఈ సమస్యలు ఉన్నాయని వెంటనే క్లియర్ చేస్తామని తెలిపారని తెలిపారు.ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పదో తరగతి స్పాట్ టోకెన్స్ వచ్చాయని తెలిపారు.
అలాగే కుల గణన టోకెన్లు తెప్పించుకొని వాటిని కూడా క్లియర్ చేస్తామని తెలిపారని తెలిపారు. పెండింగులో ఉన్న 5 డీఏ లను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేయాలని, స్పాట్ విధులకు సంబంధించి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయురంగ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీని ఫలితం రాష్ట్ర ప్రభుత్వం అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్, జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, జిల్లా కార్యదర్శులు షేక్ ఉద్దండు షరీఫ్,గుగులోతు రామకృష్ణ, పి సురేష్, సీనియర్ నాయకులు జి రాజశేఖర్, ఎన్. వీరబాబు, జానీమియా తదితరులు పాల్గొన్నారు.



