Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదో తరగతి విద్యార్థులు.. జాగ్రత్త.!

పదో తరగతి విద్యార్థులు.. జాగ్రత్త.!

- Advertisement -

మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎస్సెస్సీ పరీక్షలు
సన్నద్ధతకు ప్రతి నిమిషం కీలకం
నవతెలంగాణ – మల్హర్ రావు

పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. పాఠశాలల్లో పునఃశ్చరణ, రోజువారీ సాధన, డైలీ పరీక్షలు జరుగుతున్నాయి. వార్షిక పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ప్రతి నిమిషం కీలకమేనని,ఇంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యారంగ, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. మండలంలో ఒక కస్తూరిబ్బా ఆశ్రమ, ఒక మోడల్ స్కూల్, ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలికలు103, బాలురు87, మొత్తం 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు..
విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. విద్యార్థులు రాత్రి 8 గంటలకే నిద్ర పోవాలని టీచర్లు సూచిస్తున్నారు.పరీక్షల వేళ విద్యార్థులను ఇంటి పనులకు దూరంగా ఉంచడం ఎంతోమేలు. ఫలితాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు పోషకాహారం అత్యంత కీలకమైంది. పరీక్షలకు సిద్ధం కావాలన్నా, రాయాలన్నా బలం అవసరం అవుతుంది. ఆకు కూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, ఉడకబెట్టిన గుడ్డు, మాంసాహారులైతే చేపలు, చికెన్ వంటివి తీసుకో వచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలసటగా ఉంటే నిమ్మకాయను నీటిలో కలుపు కొని తాగాలి. పరీక్షలు అయ్యేంత వరకు బయట ఆహారం తీసుకోరాదు. విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తాడిచెర్ల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్ భాస్కర్ సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -