Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదో తరగతి విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – చౌడాపూర్
పదోవ తరగతి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నతపాఠశాల,అంగన్వాడీ కేంద్రన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదోవ తరగతి పరీక్షలు జరుగుతున్న క్రమంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యా యులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యా యులు బోధించాలని సూచించారు. మధ్యాహ్న భోజనా నికి సంబంధించిన వంటకాల నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందజేయాలన్నారు.

జాతీయ ఉపాధి హామీ కింద మంజూరైన కిచెన్ షెడ్,బాత్ రూమ్ లను వెంటనే నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు,గర్భిణులకు అందిస్తున్న పోషక ఆహారం, గుడ్ల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీకి కలెక్టర్ సూచించారు.ఇళ్ల నిర్మాణాల్లో  ఏమైనా సాంకేతిక సమస్యల ఉంటే  సరిచేసి లబ్ధిదారులకు సహకరించాలన్నారు.

అనంతరం ఫర్టిలైజర్,రేషన్ డీలర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలను తెలుసుకొని డీలర్ల వద్ద ఎరువులు పూర్తిగా అయిపోక ముందే ముందస్తుగా ఇండెంట్ పెట్టి యూరియాను తెప్పించుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి,జిల్లా వ్యవసాయ అధికారి రాజా రత్నం,తహసీల్దార్ వెంకటేశ్వర్లు,ఎంపీడీవో  సోమలింగం,ఎంఇఓ రామచందర్,సర్పంచ్ నవీన్, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -