Saturday, November 22, 2025
E-PAPER
Homeఖమ్మంపదో తరగతి విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేయాలి

పదో తరగతి విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేయాలి

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావూట

పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న దృష్ట్యా విద్యార్ధులకు ప్రతీ సబ్జెక్ట్ లోను ప్రధాన అంశాలను అభ్యసనం చేయించాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం చేయాలని ఎంఈఓ ప్రసాదరావు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో అశ్వారావుపేట (బాలురు), గుమ్మడవల్లి, నారాయణ పురం,మామిళ్ళవారి గూడెం, అచ్యుతాపురం, అశ్వారావుపేట బాలికోన్నత జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల కాంప్లెక్స్ ల టీచర్స్ కు నవంబర్ టీసీ క్లాస్ లు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. 

శుక్రవారం ఉపాధ్యాయులకు,శనివారం ప్రధానోపాధ్యాయులకు టీసీ క్లాస్ లు నిర్వహించారు.విద్యార్థుల కు మిడ్ లైన్ టెస్ట్ నిర్వహణ,విద్యార్ధుల సామర్ధ్యాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాద్యాయులు హరిత, షాహీ నా బేగం,వీరేశ్వరరావు, కొండల రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -