నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఓబీసీ 10 వ మహాసభ గోవా రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు భువనగిరి నియోజకవర్గం ఓబీసీ అధ్యక్షులు సబర్కార్ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ , తెలంగాణ నుండి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరై, మాట్లాడాలని తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం పోరాటం వల్లనే తెలంగాణలో రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ను సాధించుకున్నాము ఓబీసీల సమస్యలపై మాట్లాడతూ, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కుల గణనను చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కేంద్రము చేపట్టాలని కచ్చితంగా ఇప్పటివరకు జరిగినటువంటి 10 రాష్ట్రాల్లో మహాసభలు జరిగిన విదంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మహాసభలను ఏర్పాటు చేసి కేంద్రాన్ని మెడల్ వంచయినా సరే దేశవ్యాప్తంగా జనగణలో కుల గణనను చేపడతారని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త అన్ని జాతీయ పార్టీల నాయకులు మరియు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా నుండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు సాబన్కార్ వెంకటేష్, బిబినగర్ మండల నాయకులు ధర్నబోయిన మహిపాల్ ముదిరాజ్, గూడూరు భాస్కర్, మీసాల గణేష్, శ్రీనివాస్, రాజు, బీసీ నాయకులు పాల్గొన్నారు.