Monday, May 12, 2025
Homeజాతీయంటెన్త్ స్టేట్ టాపర్ కు బ్లడ్ క్యాన్సర్..

టెన్త్ స్టేట్ టాపర్ కు బ్లడ్ క్యాన్సర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఇషికా బాలా అనే విద్యార్థిని బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా చదువులో ఆమె వెనకడుగు వేయలేదు. ఇషిక చికిత్స కోసం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. కాంకేర్‌ జిల్లాకు చెందిన ఇషికా బ్లడ్‌ క్యాన్సర్‌తో ఒక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మళ్లీ చదువు మొదలుపెట్టి ఛత్తీస్‌గఢ్‌ సెకండరీ బోర్డు పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఐఏఎస్‌ కావాలన్నది తన కలగా ఈ చదువుల తల్లి చెబుతోంది. సామాన్య రైతు అయిన ఇషిక తండ్రి శంకర్‌ ఆమె చికిత్స కోసం ఇప్పటికే రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇషిక ఆరోగ్యం కోసం సహాయం అందేలా చూస్తామని విద్యాశాఖాధికారి అశోక్‌ కుమార్‌ పటేల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -