Wednesday, November 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగూడునివ్వని గుడారాలు

గూడునివ్వని గుడారాలు

- Advertisement -

ముంచేస్తున్న శీతాకాలం, వర్షాలు
వ్యాధులు, మరణాలపై పాలస్తీనియన్ల ఆందోళన
గాజా :
శీతాకాలంలో మొదలైన భారీ వర్షాలతో గాజా ప్రజలు బిక్కుబిక్కు మంటూ భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. తలదాచుకోవడానికి గుడా రాలు ఏర్పాటు చేయాలని, కడుపు నింపుకోవడానికి ఆహార పదార్థాలు అందజే యాలని వారు మొర పెట్టుకుంటున్నారు. లక్షలాది కుటుంబాలకు అత్యవసరంగా టెంట్లు నిర్మించి ఇవ్వాలని సహాయ సంస్థలు కూడా కోరుతున్నాయి. రెండు సంవత్సరాల పాటు జరిగిన భీకర పోరు కారణంగా మెజారిటీ పాలస్తీనావాసుల ఆవాసాలన్నీ నేలమట్టమయ్యాయి. దీంతో వారందరూ సహాయ శిబిరాలలోనే తలదాచుకోవాల్సి వస్తోంది. అయితే అవి భారీ వర్షాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. తీవ్రమైన చలిగాలుల నుంచి కాపాడలేకపోతున్నాయి. వర్షపునీరు, మురుగు నీరు కలిస్తే వ్యాధులు ప్రబలి చిన్నారులు, వృద్ధులు మృత్యువాత పడే ప్రమాదం ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
‘తినడానికి తిండి లేదు. టెంటు నిండా వర్షపు నీరు చేరింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? ఎక్కడికైనా పోదామంటే నీడ కూడా లేదు’ అని ఓ బాధిత మహిళ వాపోయారు. ఇంటిలోని సామగ్రి మొత్తం తడిసిపోయిందని, కట్టుకోవడానికి, కప్పుకోవడానికి దుస్తులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే షీట్లు, దుప్పట్లతో తయారు చేసిన గుడారాలలోనే జీవనం సాగిస్తున్నారు. గాజాలో 80 శాతానికి పైగా భవనాలు దెబ్బతిన్నాయని, నగరంలో అయితే ఇది 92శాతంగా ఉన్నదని ఇటీవల విడుదలైన ఐరాస నివేదిక ఎత్తి చూపింది. రెండున్నర లక్షల పాలస్తీనా కుటుంబాలకు (పదిహేను లక్షల మంది ప్రజలు) తక్షణమే గుడారాలు ఏర్పాటు చేయాలని ఎన్‌ఆర్‌సీ అనే స్వచ్ఛంద సంస్థ సూచించింది. కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి గాజాకు కేవలం 19 వేల గుడారాలు మాత్రమే చేరాయని తెలిపింది. పలు రూపాల్లో వస్తున్న సహాయ సామగ్రి కూడా గాజాకు సరిగా చేరడం లేదు. ఈజిప్ట్‌, జోర్డాన్‌, ఇజ్రాయిల్‌లో అవి ఆగిపోయాయి. ప్రస్తుతం నిరాశ్ర యులు తలదాచుకుంటున్న గుడారాలు ఇప్పటికే శిథిలావస్థకు చేరాయి. అవి చా లా వరకూ చినిగిపోయాయి. అనేక టెంట్లు నీటిలో నానిపోతున్నాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రజలు ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. వర్షం వచ్చిందంటే చాలు… గుడారాలు ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాయని వారు వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -