Tuesday, July 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో ఘోరం

బంగ్లాదేశ్‌లో ఘోరం

- Advertisement -

– పాఠశాల భవనంపై కూలిన సైనిక విమానం
– 19 మంది మృతి, 70 మందికి గాయాలు
ఢాకా :
బంగ్లాదేశ్‌లో సోమవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఢాకాలో బంగ్లాదేశ్‌ వైమానిక దళానికి చెందిన ఒక శిక్షణ విమానం టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే ఒక పాఠశాల భవనంపై మధ్యాహ్నం 1:06 గంటలకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల మైల్‌స్టోన్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌పై ఎఫ్‌-7 బిజిఐ అనే శిక్షణా యుద్ధవిమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు, వైమానిక దళ హెలికాప్టర్లు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. గాయపడిన వారికి కంబైన్డ్‌ మిలటరీ హాస్పిటల్‌ (సిఎంహెచ్‌), ఢాకా మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బర్న్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారులు ముహమ్మద్‌ యూనస్‌ తెలిపారు. ప్రమాదంపై బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -