నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామం శివారు ప్రాంతంలో గల ఖోరీ బసవన్న టెంపుల్ వద్ద, లాలయ్య ముస్లిం దర్గా వద్ద గుర్తుతెలియని ఆగంతకులు దొంగతనానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం దేవుడి దర్శనార్థం గ్రామంలోని బసవన్న దేవాలయం, దర్గాకు కొందరు భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో దేవాలయం, దర్గాలలో హుండీలు పగలగొట్టి ఉండటాన్ని చూశారు. భక్తులు వేసిన కానుకలను దుండగులు ఎత్తుకెళ్ళిపోయుంటారని వారు అన్నారు. అక్కడ వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయని వారు తెలిపారు.
రెండు ప్రార్ధన మందిరాల వద్ద భారీగా డబ్బులు, బంగారం, వెండి వస్తువులు దొంగతనానికి గురవ్వడం ఆశ్యర్యానికి గురిచేశాయని వారు తెలిపారు. గతంలో కూడా బసవన్న భగవాన్ దేవాలయం వద్ద హుండి దొంగతనం జరిగిందని, అప్పుడు కూడా భారీగా డబ్బులు వెండి బంగారం వస్తువులు దొంగిలించబడ్డారని అన్నారు. ఇప్పటివరకు దొంగలెవరో తెలియలేదని గ్రామస్తులు, పెద్దలు తెలిపారు. హిందు మందిరం వరుసగా రెండవసారి, ముస్లిం దర్గా వద్దా మొదటిసారి దొంగలు దొంగతనం జరిగిందని వారు తెలిపారు. పోలీసులు వీలైనంత త్వరగా దుండగులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని ఈ సంద్బంగా వారు డిమాండ్ చేశారు.
పడంపల్లి దర్గా, దేవాలయంలో దొంగల భీభత్సం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES