Thursday, May 8, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఉగ్రవాదం సమూలంగా అంతం కావాల్సిందే: కేసీఆర్

ఉగ్రవాదం సమూలంగా అంతం కావాల్సిందే: కేసీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని ఆయన అన్నారు. ఉగ్రవాదం సమూలంగా అంతం కావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. “భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను” అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అది ప్రపంచ మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కచ్చితంగా అంతమొందించాలని ఉద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -