నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉగ్రవాద మతతత్వ కుట్రలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండో-పాక్ యుద్ధం వల్ల ఇరుదేశాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది టూరిస్టులను పొట్టనబెట్టుకోవడం భారతీయులందరినీ కలిచివేసిందని, ఇది దుర్మార్గ చర్య అన్నారు. అందుకు పాకిస్థాన్ కనీసం పశ్చాత్తాపం ప్రకటించకపోవడం, కాల్పుల ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను ఇండియాకు అప్పగిస్తామని చెప్పకపోవడంతో భారత్ అనివార్యంగా ప్రతీకారచర్యలకు దిగిందన్నారు. యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు, ప్రజలకు నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రవి నాయక్, డా.మల్లు గౌతంరెడ్డి, నాయకులు, పాదూరి శశిధర్ రెడ్డి, రేమిడల పరుశురాములు, ఎండి అంజాద్, తిరుపతి రాంమూర్తి, పాదూరి గోవర్ధన్, రామారావు ఉన్నారు.
ఉగ్రవాద మతతత్వ కుట్రలను తిప్పికొట్టాలి : జూలకంటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES