ననతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు.ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపిటల్ జెవిష్ మ్యూజియం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సిబ్బందికి అతి సమీపంగా వచ్చిన ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ యూఎన్ రాయబారి డానీ డానన్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటారని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ఎంబసీపై ఉగ్రవాదుల దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES