నవతెలంగాణ – భిక్కనూర్
ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. బుధవారం పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత సైన్యం చేసిన దాడుల పట్ల షబ్బీర్ అలీ హార్షం వ్యక్తం చేశారు. పహాల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు అమాయక ప్రజలు బలయ్యారని, ఉగ్రవాదులకు భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చిందన్నారు. భారత సైన్యం కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడి చేయగా పిరికిపంద పాకిస్తాన్ సైన్యం మాత్రం ఉగ్రవాదులతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ సమీప గ్రామాలే లక్ష్యంగా అమాయక ప్రజలపై దాడులు చేస్తుందన్నారు. ఉగ్రవాదుల ఏరువేతకు భారత బలగాలు ఎలాంటి చర్యలు తీసుకున్న యావత్ భారతదేశం భారత సైనికుల వెంట ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలి: షబ్బీర్ అలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES