- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఝార్కండ్‌లోని రాంచీలో ISIS రిక్రూట్‌మెంట్ శిబిరం బయటపడింది. కొన్ని రోజుల క్రితం అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. పైకి హోటల్‌గా చెప్పకుంటున్న భవనంలోని అండర్ గ్రౌండ్‌లో ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేయడాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -