నవతెలంగాణ – హైదరాబాద్: భారత టెస్టు క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. టెస్టు క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో ఇప్పుడా పగ్గాలను యువ ఆటగాడు శుభమన్‌గిల్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్ కావడం దాదాపు ఖాయమైంది. విదేశీ గడ్డపై నిలకడగా రాణిస్తున్న పంత్ వైస్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో సెంచరీలు సాధించడంతో పాటు ఏడు సార్లు 90కి పైగా పరుగులు చేయడం అతని సామర్థ్యానికి నిదర్శనం. మరోవైపు, జస్ప్రీత్ బుమ్రా జట్టులో కీలక బౌలర్ అయినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యలు అతడిని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందం నుంచి అతడిని తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించినట్టు తెలిసింది. బుమ్రా కెప్టెన్ కానప్పుడు అతడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో అర్థం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES