హాజరైన 749 మంది సభ్యులు
12 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా అమలు పరుస్తున్నారు. చదువు రాని మహిళలను గుర్తించి చదువు నేర్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కొన్ని నెలలపాటు శిక్షణ కార్యక్రమాలు అందించి సాధారణ విద్యార్థుల మాదిరి గానే పరీక్షలు సైతం ఆదివారం నిర్వహించారు.
మండల వ్యాప్తంగా ఉన్న శ్రీలక్ష్మీ సమాఖ్య మహిళా సంఘాలలో 7,238 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో చదువుకున్నవారు 4870 మంది చదువుకొనివారు 2368 మహిళలను గుర్తించారు. వీరిని అక్షరాస్యులుగా మార్చేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళా సభ్యులు 1300 మంది,12 పరీక్ష కేంద్రాల్లో హాజరు కావాలి కానీ 749 మంది మహిళలు పరీక్షలకు హాజరయ్యారు. చదవడం, రాయడం, గణితంలలో ప్రశ్నలు ఉండగా వీటన్నింటికీ 150 మార్కులు కేటాయించారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మన్ బాబు, ఏపిఎం హనుమంతరావు, సిసిలు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేశారు.



