న్యూఢిల్లీ : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు ఇక్కడి టెక్స్‌టైట్ పరిశ్రమకు భారీ నష్టాలను మిగిల్చనుందని రేటింగ్, రీసెర్చ్ ఎజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ఆగస్టు 27 నుంచి ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో టెక్స్‌టైల్ పరిశ్రమ ఆదాయం 5-10 శాతం పతనం కావొచ్చని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయని పేర్కొంది. 40 కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. మొత్తం పరిశ్రమలో వీటి రెవెన్యూ వాటా 40-45 శాతం వరకు ఉంటుంది. అధిక టారిఫ్‌లతో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాల ఉత్పత్తులతో పోటీ పడటం కష్టంగా మారనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. టెక్స్‌టైల్ కంపెనీల లాభాలు కూడా 200-250 బేసిస్ పాయింట్లు 2.5 శాతం మేర పడిపోవచ్చని అంచనా.
టెక్స్‌టైల్ పరిశ్రమ ఆదాయం 10 శాతం పతనం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES