నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఎప్‌సెట్ దరఖాస్తుల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 4 తుది గడువు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, టీజీ ఎప్ సెట్-2026 కన్వీనర్ డాక్టర్ కె.విజయ కుమార్ రెడ్డి తదితరులతో సెట్ కమిటీ మొదటి సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోసం మే 4, 5 తేదీల్లో, ఇంజనీరింగ్ కోసం మే 9 నుంచి 11 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. టీజీ ఎప్‌సెట్ -2026ను వంద శాతం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం సిలబస్ నుంచే నిర్వహించనున్నారు.
పీజీఈసెట్ షెడ్యూల్
పీజీఈసెట్ షెడ్యూల్‌ను సెట్ కన్వీనర్ డాక్టర్ కె.వెంకటేశ్వర రావు విడుదల చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 27 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మే 6 తుది గడువు. మే 28 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహిస్తారు.
పీఈసెట్ షెడ్యూల్
టీజీపీఈసెట్ నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 25న విడుదల చేస్తారు. మార్చి 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాథ రుసుం లేకుండా మే 5 వరకు, వివిధ స్లాబ్‌లతో అపరాధ రుసుంలతో కలుపుకుని మే 20 వరకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు. మే 31 నుంచి జూన్ 6 వరకు పరీక్షలను నిర్వహిస్తారు.
టీజీఎప్ సెట్ షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



