Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్.. అండర్ సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలు

టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్.. అండర్ సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలు

- Advertisement -

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

టీజీ పీఎస్సి ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ – 2025 కోసం జిల్లా లోని నిజామాబాదు పరిధి లోని పరీక్ష కేంద్రాల వద్ద నవంబర్ 8 నుండి 14వ వరకు ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు టి జీ పీఎస్సి ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ -2025 ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం తెలిపారు. నిజామాబాదు నగరంలోని ఏవీ ఎంటర్ ప్రైజ్స్ అర్సపల్లి బైపాస్ సెంటర్ పరీక్షా కేంద్రాo వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తు గా నిరోధించాలనే ఉద్దేశ్యంతో  నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 ఆఫ్ బి ఎన్ ఎస్ ఎస్ అమలులో ఉంటుంది అని తెలియజేసారు.అండర్ సెక్షన్ 163 ఆఫ్ బిి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు.

నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు..
పరీక్షా కేంద్రాo పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌ లను మరియు లౌడ్ స్పీకర్ల లను తేది:08-11-2025 నుండి తేదీ:14-11-2025 ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు మూసివేయాలి. నిషేధిత ఉత్తర్వులు తేది : 08-11-2025 నుండి తేది: 14-11-2025 ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు అమలులో ఉంటాయి అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -