నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు ప్రారంభమయ్యాయి. బుధవారం బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కాశీరాం, నిజామాబాద్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాయి కుమార్ హాజరై టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు ప్రారంభించారు. కమ్మర్ పల్లి మండల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని మీ పార్సల్ లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు బుకింగ్ చేసుకోని పంపించుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థమే ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమలో పొందేటి క్రాంతి కుమార్, శివాజీ, ప్రవీణ్, జిషన్, సంతోష్, దీక్షిత్, కోరే నవీన్, తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్ పల్లిలో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



