Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుTGSRTC: ప్రయాణికులకు అదిరే గుడ్ న్యూస్..!

TGSRTC: ప్రయాణికులకు అదిరే గుడ్ న్యూస్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్‌టీసీ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ప్రయాణికుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. శంషాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి విమానాశ్రయం మీదుగా తుక్కుగూడ వరకు తొలిసారిగా ఆర్డినరీ బస్సు సేవలను టీజీఆర్‌టీసీ ప్రారంభించింది. సోమవారం రాజేంద్రనగర్‌ డిపో మేనేజర్‌ కృష్ణారెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఏరోరైడర్‌ పేరుతో నూతన సర్వీసులు – ఈ కొత్త బస్సు మార్గాన్ని “ఏరోరైడర్‌ – ఎయిర్‌పోర్ట్‌ స్పెషల్‌” పేరిట ప్రారంభించారు. ఈ సేవల కోసం రాజేంద్రనగర్‌, మహేశ్వరం డిపోలకు చెందిన రెండు ఆర్డినరీ బస్సులను వినియోగిస్తున్నారు. బస్సులు ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు శంషాబాద్‌, తుక్కుగూడ బస్టాండ్ల నుంచి బయలుదేరి, ఎయిర్‌పోర్ట్‌ డిపార్చర్‌ టెర్మినల్‌ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులకు అందుబాటులో – తక్కువ చార్జీ, పాస్‌ అనుమతులు ఉంటాయి. ఈ బస్సు సేవలపై ప్రయాణికులకు ఎంతో తక్కువ ధరలో ప్రయాణ అవకాశం లభించనుంది. శంషాబాద్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు ఒక్కసారి ప్రయాణానికి కేవలం రూ.20 మాత్రమే ఛార్జీగా నిర్ణయించారని డిపో మేనేజర్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad