Friday, June 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన..దరఖాస్తులకు ఆహ్వానం

టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన..దరఖాస్తులకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మోటార్‌ మెకానిక్‌‌ వెహికల్‌, మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ కోర్సులలో ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్‌ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీలోపు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ ఒక మంచి అవకాశమని సంస్థ పేర్కొన్నది. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్‌లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఇప్పటికే ఇదే విషయమై సంస్థ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పోస్టుల భర్తీకి కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీలో 3 వేల 38 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబడింది. 3,038 భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి ఆయన సూచించారు.

మొత్తం 3,038 ఉద్యోగాల్లో 2,000 డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 743 శ్రామిక్ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) పోస్టులు, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్ , 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -