Saturday, May 24, 2025
Homeసినిమాసరికొత్త కాన్సెప్ట్‌తో 'థ్యాంక్యూ డియర్‌'

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘థ్యాంక్యూ డియర్‌’

- Advertisement -


యువ హీరో ధనుష్‌ రఘుముద్రి నటించిన ‘థ్యాంక్యూ డియర్‌’ చిత్ర ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ ఘనంగా జరిగింది. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఫస్ట్‌ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా హీరో ధనుష్‌ మాట్లాడుతూ, ‘ఇది నా రెండో చిత్రం. తమ్మారెడ్డి లాంటి సీనియర్‌ ప్రొడ్యూసర్‌ మా సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా కీలకమైనది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
‘ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుంది. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం’ అని నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి చెప్పారు. లైన్‌ ప్రొడ్యూసర్‌ పునీత్‌ రాయల్‌ మాట్లాడుతూ, ‘సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాం. ఈ చిత్రం యువతని కచ్చితంగా ఆకట్టుకుని, విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
హెబ్బా పటేల్‌, ధనుష్‌ రఘుముద్రి, రేఖ నిరోషా, వీర శంకర్‌, నాగ మహేష్‌, రవి ప్రకాష్‌, ఛత్రపతి శేఖర్‌, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్‌ – శ్రీనివాస్‌ నాయుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రైటర్‌- డైరెక్టర్‌ : తోట శ్రీకాంత్‌ కుమార్‌, ఎడిటర్‌ :రాఘవేంద్ర పెబ్బేటి, మ్యూజిక్‌ – సుభాష్‌ ఆనంద్‌, డి ఓ పి : పి ఎల్‌ కె రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -