Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శిక్షణ కేంద్రాల మంజూరుకు కృతజ్ఞతలు..

శిక్షణ కేంద్రాల మంజూరుకు కృతజ్ఞతలు..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : రాష్ట్రంలో శిక్షణ కేంద్రాల మంజూరుకు ఆమొదం తెలిపిన మంత్రులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కోపరేటివ్ యూనియన్ సంస్థకు హైదరాబాద్ వరంగల్ లో రెండు శిక్షణ కేంద్రాలు ఉంటే తాను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించబడిన తర్వాత కోపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేయాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వానికి శిక్షణ కేంద్రాలు ఎక్కువ చేయాలని విన్నవించడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు శిక్షణా కేంద్రాలను చేయడం జరిగింది. నిజామాబాద్, మహబూబ్నగర్ ,ఖమ్మం మూడు ప్రాంతాలలో నూతన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఈ మూడు శిక్షణ కేంద్రాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కి, రాష్ట్ర కోపరేటివ్ సెక్రటరీ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో నిజామాబాద్ లో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. శిక్షణ తరగతులు నిజామాబాద్ లోనే ఇస్తామని తెలియజేస్తున్నాను.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad