నవతెలంగాణ -మల్హర్ రావు: బిసిలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిసి జెఏసి రాష్ట్ర పిలుపు మేరకు శనివారం బిసి జెఏసీ మండల నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యుర్,తాడిచెర్ల గ్రామాల్లో చేపట్టిన బిసి బంద్ కు అన్ని వర్గాల సకల జనులు హాజరై బిసి బంద్ విజయవంతం చేయడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బిసి బంద్ ను స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతోనే 100% బీసీలకు బంద్ విజయవంతం చేయడం జరిగిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లోని అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% వాటాని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
బంద్ ఫర్ జస్టిస్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందని, స్వచ్ఛందంగా చిరు వ్యాపారులు, దుకాణాలు, ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలు బందు పాటించి మద్దతు ఇవ్వడాన్ని హర్షిస్తూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ ఉద్యమం జరిగిందన్నారు. భవిష్యత్తులో బీసీల హక్కులను సాధించేందుకు ఇది తోడ్పడుతుందని,అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కలిసికట్టుగా బిసి హక్కుల కోసం పోరాడాలని,స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో 42% వాటా అమలయ్యేదాకా పోరాటం ఆగదన్నారు.బిసిలంతా మమేకమై వాటాన్ని సాధించేవరకు ఉద్యమం ఆపద్దని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ బిసి సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు,అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.