- Advertisement -
భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు: 2023 మార్చి 29న అప్పటి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తాడిచెర్లలో ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు కోసం ఆర్ ఓ ప్లాంట్, తాడిచెర్లకు బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ కు భూపాలపల్లి కలెక్టర్ సాంక్షన్ ఇవ్వడం జరిగిందని తాడిచెర్ల-కాపురం భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాడిచెర్ల కు ఆర్.ఓ ప్లాంట్ మంజూరు ఇప్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తాడిచెర్ల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా వెల్లడించారు.
- Advertisement -