సంక్రాంతిని నవ్వుల పండగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగు పెట్టారు హీరో నవీన్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమ ర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథనాయిక. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించిన చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు తమ సంతోషాన్ని పంచుకుంది.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ,’ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోల నుంచే అద్భుతమైన స్పందన లభించింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చూడనివారు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నారు ప్రేక్షకులు. అదే సమయంలో క్లైమాక్స్‌లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. హాయిగా నవ్వుకుందామని వస్తే, చివరిలో కంటతడి పెట్టించారు అంటూ ఎందరో ప్రశంసిస్తున్నారు. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ని ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా కతజ్ఞతలు’ అని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ,’ఈ సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాము. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. అన్ని చోట్లా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకులు సినిమాలో కామెడీని ఎంత ఎంజారు చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్‌కి కనెక్ట్ అవుతున్నారు. రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూళ్లు వస్తాయి’ అని తెలిపారు.
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -



