Saturday, January 17, 2026
E-PAPER
Homeసినిమాబ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

- Advertisement -

హీరో రవితేజ నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించారు. డింపుల్‌ హయతి, ఆషిక రంగనాథ్‌ కథానాయికలు. ఈనెల 13న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ మీట్‌ నిర్వహించారు.
రవితేజ మాట్లాడుతూ, ‘సినిమా చాలా అద్భుతంగా ఉంది. సంక్రాంతికి ఫుల్‌ ఎంటర్టైన్మెంట్‌. అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమాని హిట్‌ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు. సినిమాకి ఇంకా చాలా మంచి రన్‌ ఉంటుంది.

డింపుల్‌ క్యారెక్టర్‌ అద్భుతంగా చేసింది. తన పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఆషిక కూడా అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేసింది. అందరు కూడా కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉందని చెప్తున్నారు. డైరెక్టర్‌ కిషోర్‌కి ఆర్గానిక్‌ కామెడీ టైమింగ్‌ ఉంది. బాలు మహేంద్ర , జంధ్యాల, క్రేజీ మోహన్‌ లాంటి ఫ్లేవర్‌ ఉన్న రైటింగ్‌ తనది. ఎమోషన్‌, ఎంటర్టైన్మెంట్‌ అద్భుతంగా రాస్తాడు. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. కిషోర్‌ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. భీమ్స్‌ వండర్ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్యూ. థియేటర్‌ విజిట్స్‌కి వెళ్ళాను. నాన్‌ స్టాప్‌గా నవ్వుతున్నారు. ప్రతి క్యారెక్టర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఫన్‌ చాలా ఆర్గానిక్‌గా ఉందని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది’ అని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల అన్నారు. ‘ఈ సంక్రాంతి సక్సెస్‌ మీట్‌ మాకు ఎంతో స్పెషల్‌. ఇందులో చేసిన బాలమణి క్యారెక్టర్‌ నాకు చాలా స్పెషల్‌. అందరూ కూడా ఆ క్యారెక్టర్‌తో రిలేట్‌ అవుతున్నారు. కిషోర్‌ అద్భుతంగా ఆ క్యారెక్టర్‌ని రాశారు. రవితేజతో ఇది నాకు రెండో సినిమా. ఆడియన్స్‌ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు’ అని హీరోయిన్‌ డింపుల్‌ తెలిపారు. సునీల్‌ మాట్లాడుతూ,’ఈ సంక్రాంతికి నలుగురు నవ్వించే అవకాశం ఈ సినిమాలో నాకు వచ్చింది. చాలా రోజుల తర్వాత నా కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేశామని నా ఫ్రెండ్స్‌ భీమవరం నుంచి ఫోన్‌ చేసి చెప్పారు. రవితేజ రేస్‌ కారు. ఆ రేస్‌ని ఫ్యామిలీ ట్రాక్‌లో పెట్టి డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల అద్భుతమైన విజయాన్ని అందించారు’ అని తెలిపారు.

సంక్రాంతికి అద్భుతమైన బ్లాక్బస్టర్‌ ఇచ్చిన ఆడియన్స్‌ అందరికీ ధన్యవాదాలు. అన్ని వైపుల నుంచి కూడా చాలా మంచి సినిమా అని రెస్పాన్స్‌ వస్తోంది. ఇంత కాంపిటీషన్లో కూడా పెద్ద హిట్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది. -నిర్మాత సుధాకర్‌ చెరుకూరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -