Monday, December 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

- Advertisement -

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు.
ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌తో, హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ అఖండ భారత్‌ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ,’శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు, యావత్‌ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి.

మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా ఆబాల గోపాలాన్ని అలరించిందని యావత్‌ ప్రపంచం చెబుతోంది. ఈ సినిమాలోని ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగ ప్రకంపనం. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు. ‘సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది, ఏ స్థాయిలో ఉందనేది పెద్దలు మాట్లాడారు.

ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలబడిన దిల్‌ రాజుకి, మ్యాంగో రామ్‌కి, శ్రీధర్‌కి, డాక్టర్‌ సురేంద్రకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌, ఆర్టిస్ట్‌ ఏం మ్యాజిక్‌ చేశారనేది మీరు స్క్రీన్‌ మీద చూసేశారు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు’ అని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను చెప్పారు. నిర్మాత దిల్‌ రాజ్‌ మాట్లాడుతూ,’విడుదలైన అన్ని చోట్ల రియాక్షన్స్‌ అదిరిపోయింది. బాలకృష్ణని బోయపాటి ఇండియన్‌ సూపర్‌ హీరో చేశారు. ఒక గొప్ప మ్యాజిక్‌ జరిగింది. ఆడియన్స్‌ ప్రతి ఎపిసోడ్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ ఇస్తున్నారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -