Friday, December 19, 2025
E-PAPER
Homeసినిమా'మోగ్లీ'ని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

‘మోగ్లీ’ని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

- Advertisement -

హీరో రోషన్‌ కనకాల నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు.
ఈ నెల 13న వరల్డ్‌ వైడ్‌ విడుదలై, వైల్డ్‌ బ్లాక్‌ బస్టర్‌గా అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన థ్యాంక్యూ మీట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ,”మోగ్లీ’ లాంటి మంచి సినిమాని సపోర్ట్‌ చేసినందుకు కృతజ్ఞతలు. మోగ్లీ నాకు చాలా ఫేవరెట్‌. చిన్నప్పుడు నుంచి ఆ క్యారెక్టర్‌ చూస్తూ పెరిగా. ఈరోజు ఆ టైటిల్‌తో సినిమా రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రోషన్‌ అద్భుతంగా నటించాడు.

అలాగే బండి సరోజ్‌ కూడా చాలా బాగా చేశారు. మీ అందరి సపోర్ట్‌ ఉండడం వల్లే ఈ సినిమా ఎంత సక్సెస్‌ అయింది. హర్ష బంటి క్యారెక్టర్‌లో బాగా ఇమిడిపోయారు. ఇండస్ట్రీలో హార్డ్‌ వర్క్‌ మాత్రమే మాట్లాడుతుంది. సందీప్‌ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇంత మంచి సినిమాని సపోర్ట్‌ చేసిన నిర్మాత విశ్వప్రసాద్‌కి అభినందనలు. ఆయన చివరి నిమిషంలో సినిమాని ఒక రోజు వెనక్కి కూడా తీసుకెళ్లారు. అది మామూలు విషయం కాదు. రాజీవ్‌ నాకు అన్నయ్య. సుమ వదిన. సుమ అన్ని సినిమాలు తనవిగా భావించి సపోర్ట్‌ చేస్తారు. మా వదిన వాళ్ళ అబ్బాయికి మంచి సినిమా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రోషన్‌ మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -